రెండేళ్లుగా అడుగుతుంటే ఇప్పుడు మార్చారు.. చిన్న పోస్టర్ స్థానంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు

by Aamani |
రెండేళ్లుగా అడుగుతుంటే ఇప్పుడు మార్చారు..  చిన్న పోస్టర్ స్థానంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు
X

దిశ,భిక్కనూరు : సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఇంత చిన్న వాల్ పోస్టర్ తో సరి పెట్టుకుంటారా...? అని రెండేళ్లుగా అడుగుతుంటే యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు స్పందించి పెద్ద ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసిన వైనం భిక్కనూరు మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద సరిగా కనబడని విధంగా కార్యాలయంలోని కంప్యూటర్ తో తయారు చేసిన చిన్న వాల్ పోస్టర్ ను నామమాత్రంగా గోడకు అతికించారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్.టి.ఐ జిల్లా ప్రతినిధి గంగల రవీందర్ బదిలీపై వెళ్లిన ఇద్దరు ముగ్గురు తహసిల్దార్ల దృష్టికి ఇదివరకు తీసుకెళ్లి నప్పటికీ వారెవరు పట్టించుకోలేక పోయారు.

కొత్తగా వచ్చిన ప్రస్తుత తహసీల్దార్ కే శివప్రసాద్ ను ఈ విషయం ప్రశ్నించగా వెంటనే స్పందించిన ఆయన, అందరికీ కనబడే విధంగా కొత్త ఫ్లెక్సీని కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయించారు. దీంతో ఆర్.టి.ఐ జిల్లా ప్రతినిధి రవీందర్ తహసిల్దార్ శివప్రసాద్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి సంబంధించి ప్రజలకు పూర్తి వివరాలు తెలిసేలా పెద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story