ఈ రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం.. జస్ట్ టికెట్ ఖర్చు పెట్టుకుంటే చాలు..

by Sumithra |
ఈ రైలు ప్రయాణికులకు ఉచిత ఆహారం.. జస్ట్ టికెట్ ఖర్చు పెట్టుకుంటే చాలు..
X

వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : చాలా మంది రైలులో దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇంటి నుంచి రుచికరమైన భోజనాన్ని పార్సల్ పట్టుకుంటారు. ఇక మరికొంతమంది స్టేషన్లలో ఫ్లాట్ ఫారం మీద అమ్మే భోజనాన్ని తీసుకుని తింటారు. కొన్ని రైళ్లలో ప్యాంట్రీ కార్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అప్పుడు ప్రయాణికులు భోజనం ఆర్డర్ పెట్టుకుంటారు. అలా వేడి ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఇదంతా ఇలా ఉంటే ఓ రైలుతో మాత్రం ప్రయాణికులకు ఫ్రీగా భోజనం అందిస్తారట. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంతకీ అది ఏ రైలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం మాట్లాడుకునే రైలు పేరు సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ (12715). ఈ రైలులో ప్రయాణించే ప్రయాణీకులందరికీ ఉచిత ఆహారం లభిస్తుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రత్యేక లంగర్ ( భోజనాలు) అందజేస్తున్నారు. సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ మొత్తంగా 39 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో 6 స్టేషన్లలో ప్రయాణికుల కోసం లంగర్ ( భోజనాలు) అందిస్తారు. ప్రయాణీకుల లంగర్ (భోజనాల) లు హాయిగా తినే విధంగా రైలును ఆపుతారు.

అమృత్‌సర్ - నాందేడ్ సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ 29 సంవత్సరాలుగా ప్రయాణీకులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని అందిస్తోంది. రైలులో ప్రయాణించే వ్యక్తులు తమతో పాటు పాత్రలను తీసుకువెళతారు. ఈ రైలు చేసే మొత్తం ప్రయాణం 2081 కిలోమీటర్లు, ఇందులో 6 చోట్ల లంగర్లు ( భోజనాలు) అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఆహారం తీసుకోవచ్చు. సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ సిక్కుల రెండు అతిపెద్ద పుణ్యక్షేత్రాలు, అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందర్ సాహిబ్, నాందేడ్ (మహారాష్ట్ర)లోని శ్రీ హజూర్ సాహిబ్ సచ్‌ఖండ్‌లను కలుపుతుంది. అందుకే లంగర్ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఈ భోజనాల్లో కడి-అన్నం, చోలే-రైస్, పప్పు, కిచిడీ-కూరగాయల వంటలు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed