Air show : మెరీనా బీచ్ లో వైమానిక దళం మెగా ఎయిర్ షో

by Shamantha N |
Air show : మెరీనా బీచ్ లో వైమానిక దళం మెగా ఎయిర్ షో
X

దిశ, నేషనల్ బ్యూరో: చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం (Indian Air Force) మెగా ఎయిర్ షో నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 8న మెరీనా బీచ్ ప్రాంతంలో వైమానిక దళ దినోత్సవం జరగనుంది. 92వ ఎయిర్ ఫోర్స్ డే ఏర్పాట్లలో భాగంగా ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, తమిళనాడు మంత్రులు, సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ విన్యాసాలు

ఎయిర్ షోలో భాగంగా మొత్తం 72 యుద్ధవిమానాలతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రదర్శనలో రఫేల్‌, సు-30, మిగ్‌, జాగ్వార్, తేజస్‌ విమానాలను కూడా ప్రదర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎయిర్ షోలో హెలికాఫ్టర్‌ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత వైమానిక దళం గరుడ్ కమాండోలు హెలికాప్టర్లతో విన్యాసాలు చేశారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed