అవిశ్వాసం వీగిపోవడం వెనక కుట్ర ఉంది

by Sridhar Babu |
అవిశ్వాసం వీగిపోవడం వెనక కుట్ర ఉంది
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం వీగిపోవడం వెనక కుట్ర దాగి ఉందని ఆర్మూర్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ జీవీ నరసింహారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బీజేపీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయంలో మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్య 36 మంది ఉన్నారని, దీని ప్రకారం మున్సిపల్ అధికారులు, ఆర్డీవో 24 మంది కౌన్సిలర్ సభ్యుల తీర్మానంతో మున్సిపల్ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ప్రకటించారన్నారు.

ఆర్మూర్ మున్సిపల్ సమావేశానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు నమోదు చేసు కోలేదన్నారు. కానీ ఆర్మూర్ మున్సిపల్ లో గత నెల నాలుగున నిర్వహించిన మున్సిపల్ అవిశ్వాస పరీక్ష అప్పట్లో అధికారులు నెగ్గినట్లు ప్రకటించినా, ఇటీవల మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటన చేయడం హాస్యాస్పదమన్నారు. మున్సిపల్ అవిశ్వాస తీర్మానం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, నాయకులు కలిగోట గంగాధర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story