- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీ మార్గమే రాజ మార్గం
దిశ, కామారెడ్డి :ఈనెల 14న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ కోరారు. రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు. సమయాన్ని, డబ్బులను ఆదా చేసుకోవాలని,కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమన్నారు. రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు. కొట్టుకుంటే ఒకరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరు గెలుస్తారన్నారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులలో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు, పోలీస్ సిబ్బంది రాజీ పడే కేసులను గుర్తించి, ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి,రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు.