JNU: విద్యార్థుల మధ్య కొట్లాట.. గొడవకు కారణం ఆ సినిమానే!

by Gantepaka Srikanth |
JNU: విద్యార్థుల మధ్య కొట్లాట.. గొడవకు కారణం ఆ సినిమానే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని జేఎన్‌యూ(JNU)లో మరోసారి ఘర్షణలు జరిగాయి. గురువారం ఏబీవీపీ(ABVP), లెఫ్ట్(Left ) విద్యార్థుల మధ్య వివాదం చోటుచేసుకుంది. చివరకు అది కొట్లాటకు దారి తీసింది. ఈ దాడిలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఏబీవీపీ నేతలు సబర్మతి సినిమా(Sabarmati Report Movie)ను ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న లెఫ్ట్ విద్యార్థులు సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసింది. లెఫ్ట్, ఏబీవీపీ విద్యార్థులు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు.

ధీరజ్ సర్నా దర్శకత్వంలో వచ్చిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను ఏక్తా కపూర్, శోభా కపూర్, అమూల్ వి.మోహన్, అన్షుల్ మోహన్ సంయుక్తంగా నిర్మించారు. విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిధి డోగ్రా, బర్కా సింగ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. ఇటీవల ప్రధాని మోడీ సైతం కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి థియేటర్‌లో సినిమాను వీక్షించారు. 2002 ఫిబ్రవరి 27న జరిగిన గోద్రా రైలు దుర్ఘటన ఘటన ఆధారంగా ‘ది సబర్మతి రిపోర్ట్‌’ చిత్రాన్ని రూపొందించారు.

Advertisement

Next Story

Most Viewed