విద్య, వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

by Sridhar Babu |
విద్య, వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
X

దిశ, ఆర్మూర్ : విద్య, వైద్యం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులో గల లాలన వృద్ధాశ్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ

ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ తదితర నాయకులతో కలిసి మంత్రి సహా ఫంక్తి భోజనం చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరతను నోటిఫికేషన్ పద్ధతిలో భర్తీ చేపడతామన్నారు.సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి చేద్దామంటే నిధులు కొరత ఉందని, వీటన్నింటినీ త్వరలోనే అధిగమిస్తామన్నారు. వృద్ధాశ్రమాల నిర్వహణ సాహసోపేతమైన నిర్ణయమని, వృద్ధాశ్రమాల నిర్వాహకులను తప్పకుండా అభినందించాల్సిందేనని అన్నారు. మీ ప్రాంతాల్లో వృద్ధాశ్రమాల నిర్వహణకు దాతలు తోచినంతగా సహాయ సహకారాలు అందించాలన్నారు.

అనంతరం మాక్లుర్ మండలంలోని గుత్ప లో గల అపురూప వెంకటేశ్వర స్వామి మందిరంలో మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ పింజ రాజ గంగారం, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విట్టం జీవన్, మండలాధ్యక్షుడు చేపూర్ ఎస్కే చిన్నారెడ్డి, మైనారిటీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఎస్కే బబ్లు, ఫయిం, ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story