Road Repair : రాళ్లు తేలిన రహదారి.. నోరు తెరిచిన గుంతలు

by Aamani |
Road Repair : రాళ్లు తేలిన రహదారి.. నోరు తెరిచిన గుంతలు
X

దిశ,తాడ్వాయి : రాళ్లు తేలిన రహదారి నోళ్లు తెరిచిన గుంతలు రాజంపేట మండలంలో దర్శనం ఇస్తున్నాయి.లక్షలు ఖర్చు చేసి వేసిన రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతున్నాయి.అర్గోoడ గ్రామానికి మండల కేంద్రానికి మధ్య మార్గంలో ఉన్న రోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యానికి ఇవి అద్దం పడుతున్నాయి.నిత్యం ఈ మార్గం గుండా 10 గ్రామాల ప్రజలు వివిధ పనుల రీత్యా జిల్లా కేంద్రానికి నిత్యం వాహనాల రాకపోకలను కొనసాగిస్తుంటారు.అలాంటిది వేసవి కాలంలోనే ఈ రోడ్డు గుంతలు ఏర్పడడంతో కంకర వేసి అధికారులు చేతులు దులుపుకున్నారే తప్ప వాటిపై పూర్తి స్థాయిలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేసిన దాఖలాలు కనిపించలేదు.

దీంతో వేసిన కంకర వెళ్లడంతో మళ్ళీ రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు పడడంతో నరకం చూస్తున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య కురిసిన వర్షానికి గుంతల రోడ్లు మరింత అధ్వానంగా మారాయి.దీంతో రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు తప్పించబోయి ఆటోలు, ద్విచక్రవాహనాలు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలకు అడ్డుగా వెళ్లడంతో ప్రమాదాలు సంబవిస్తున్నాయయి.దీంతో ప్రయాణం కొనసాగించాలంటే ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మత్తులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగేలా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed