హత్య కేసును ఛేదించిన పోలీసులు

by Sridhar Babu |
హత్య కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, లింగం పేట్ : లింగంపేట మండలం సంగారెడ్డి గ్రామానికి చెందిన మద్దెల కమలమ్మ హత్య కేసును లింగంపేట పోలీసులు ఛేదించారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మధ్యల కమలమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా జీవించేది. కమలమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కాజేయాలని అదే గ్రామానికి చెందిన పరకాల రాజు అలియాస్ జీవన్ ప్లాన్​ వేశాడు. అనుకున్నట్టుగాను కమలమ్మ ఇంట్లో దూరి ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, జత కమ్మలు అపహరించాడు. కమలమ్మను గుర్తు

తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు కమలమ్మ బంధువు వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య చేసిన రాజు గ్రామంలో కనిపించకుండా పోయాడు. వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలో కనిపించకుండా పోయిన జీవన్ పై ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. శనివారం ఉదయం జీవన్ ను శెట్టిపల్లి గ్రామం చౌరస్తా వద్ద పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుండి 15 గ్రాముల బంగారం, రెండు గ్రాముల కమ్మలు రికవరీ చేసినట్లు డీఎస్పి తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రాజు, లిక్య నాయక్​లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed