గ్రామపంచాయతీ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తులకు నోటీసులు జారీ..

by Sumithra |
గ్రామపంచాయతీ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తులకు నోటీసులు జారీ..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : గ్రామపంచాయతీ భూమి ఆక్రమణ, కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా అనే శీర్షికన దిశ దినపత్రికలో సోమవారం వచ్చిన కథనానికి అధికారులు స్పందించి కబ్జాదారులకు నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్ పేట్ గ్రామంలోని పెట్రోల్ పంపు ఎదురుగా బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే గ్రామపంచాయతీ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ కబ్జా చేస్తున్న విషయాన్ని దిశ దినపత్రికలో సోమవారం వార్త ప్రచురితం కాగా గ్రామపంచాయతీ కార్యదర్శి కిష్టయ్య స్పందించి సోమవారం గ్రామపంచాయతీ స్థలాన్ని కబ్జాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు.

గ్రామపంచాయతీ స్థలం కబ్జా చేస్తున్న కమ్మరి నారాయణ, ఎం.డి.నయీమ్, ఎం.డి.ఇంతియాజ్ అనే ముగ్గురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. గ్రామపంచాయతీ స్థలంలో ఉన్న తమ రేకుల షెడ్డులను 24 గంటలలోపు పూర్తిగా తొలగించాలని, రేకుల షెడ్డులను తొలగించకుంటే చటపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశామన్నారు. గ్రామపంచాయతీ స్థలం కబ్జా చేసిన విషయంపై దిశ దినపత్రికలో వార్త ప్రచురించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ కబ్జాలకు పాల్పడిన వారిని పూర్తిగా తొలగించేలా అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed