- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే సతీమణి..
దిశ, నిజాంసాగర్ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సతీమణి తోట అర్చన ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎగువ ప్రాంతంలొ కురిసిన వర్షానికి వస్తున్న భారీ నీటి ప్రవాహానికి నిజాంసాగర్ ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీళ్లను విడుదల చేయడంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. సందర్శనకు వచ్చిన ఆమె మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో ఇక్కడకు సందర్శకులు ఎక్కువగా వస్తుంటారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గేట్ల కింది భాగంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుందని, అక్కడకి సందర్శకులను వెళ్లకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉండే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు పైనకి సందర్శకులకు అనుమతులు ఇవ్వడం లేదని కొందరు ఆమె దృష్టికి తీసుకుపోగా దీని విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని పర్యాటకులకు ఆమె సూచించారు. ఈమె వెంట నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, మాజీ జెడ్పీటీసీ చీకోటి జయ ప్రదీప్, కిషోర్, రాహుల్, గాండ్ల రమేష్, రాము రాథోడ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు నాయకులు పాల్గొన్నారు.