- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంధకారంలో ప్రభుత్వ హాస్పిటల్.. ఎమర్జెన్సీ సేవలు బంద్..
దిశ, గాంధారి: హాస్పిటల్లో.. కరెంట్ లేదని చెప్పి రాత్రి అయిందంటే చాలు ఎమర్జెన్సీ సేవలు బంద్ చేస్తున్న ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం కరెంటు పనులు బాగు చేయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
సోమవారం రాత్రి ఇద్దరు గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం వస్తే వారికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయక అంబులెన్స్ లో కామారెడ్డి పంపించి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై దిశ వివరణ కోరగా అధికారులు కంటి వెలుగులో ఒకరు, ఇన్చార్జి అయినటువంటి వారు కరెంట్ మెకానిక్ పెళ్లికి వెళ్లడంతో ఊరికి వెళ్లడం జరిగిందని మెకానిక్ రాగానే కరెంటు పనులు బాగు చేస్తామని తెలపడం విశేషం. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇంత పెద్ద గాంధారి మండల కేంద్రంలో ఒక్కరే కరెంట్ మెకానిక్ ఉన్నారా అనే ప్రశ్నకు జవాబు లేదు.
చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం 48 గంటలు కావస్తున్న ఇప్పటికి కూడా కరెంటు మరమ్మత్తులు జరగకపోవడం పై అధికారులు ఎంత నిర్లక్ష్యం తో ఉన్నారు ఇట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా రాత్రి 11 గంటలు అయితే చాలు సెక్యూరిటీ సిబ్బంది గేటుకు తాళం వేయాల్సిన అవసరం ఏముంది. రాత్రి ఎమర్జెన్సీ కేసు వస్తే కనీసం ఇంజక్షన్ చేసేందుకు కూడా వీలు లేని పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.