- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడ్ల వ్యాపారిని నిర్భందించిన రైతులు
ఏడాదిగా ధాన్యం డబ్బు ఇవ్వకుండా తప్పించుకుంటున్న వ్యాపారి
డబ్బులిచ్చి కదలాలంటూ అన్నదాతల డిమాండ్
దిశ, భీమ్‌గల్: జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బు ఎగ్గొట్టిన వ్యాపారిని రైతులు నిర్భందించారు. ఈ ఘటన భీమ్‌గల్ మండలం జగిర్యాల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ కి చెందిన వ్యాపారి గంప శ్రీనివాస్ గతేడాది మండలంలోని బీబీ తండా, కుపకల్, జగిర్యాల్ గ్రామాలకు చెందిన దాదాపు 120 మంది రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేశాడు.
అందుకు సంబంధించిన రూ.1.30 కోట్ల పైకాన్ని ఇప్పటికి వరకు వ్యాపారి రైతులకు చెల్లించలేదు. ఇదే విషయంపై వ్యాపారిని ఎప్పుడూ అడిగినా.. వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. డబ్బు విషయంపై అధికారులకు విన్నవించినా లాభం లేకపోవడంతో మూడు గ్రామాలకు చెందిన రైతులు నిన్న రాత్రి జగిర్యాల్ గ్రామంలో వ్యాపారిని తీసుకొచ్చి నిర్భందించారు. రైతులు తమకు డబ్బు చెల్లించే వరకు వదిలే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు.
గతంలో ఇదే వ్యాపారి రైతులకు డబ్బు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చారు. అవి కాస్తా.. బౌన్స్ అయ్యాయి. దీంతో రైతులు వ్యాపారి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ యేడాది ప్రథమార్థంలో రైతుల తాలుకు డబ్బు చెల్లించేందుకు మానిక్ భండార్ వద్ద ఉన్న స్థలాన్ని రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కు ఒప్పుకున్నాడు. కానీ సంబంధిత స్థలానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో రైతులు తమకు డబ్బే కావాలని కోరుతున్నారు.