భక్తుల కొంగు బంగారం.. నాలేశ్వర్ రాజేశుడు

by samatah |
భక్తుల కొంగు బంగారం.. నాలేశ్వర్ రాజేశుడు
X

దిశ, నవీపేట్ : భక్తుల కొంగు బంగారంల కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి గాంచిన నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయం‌లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. గోదావరి కి రెండు వైపుల వెలసిన తెలంగాణ పంచారామలయాలలో ప్రఖ్యాతి గాంచిన ఈ నాలేశ్వర్ రాజ రాజేశ్వర ఆలయానికి శివరాత్రి కి తెలంగాణ, మహారాష్ట్ర ల నుండి వేలాది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకుంటారు.

వేములవాడ చిన్న రాజన్న.. నాలేశ్వర్ పెద్ద రాజన్న

గోదావరి నది తీరాన స్వయంభూగా వేలిసిన ఈ శివాలయానికి ఓక ప్రత్యేకత ఉంది. వేములవాడలో వేలసిన రాజన్నను తమ్ముడిగా,నాళేశ్వర్ లో వేలసిన రాజన్న‌ను పెద్దన్న గా కొలుస్తారు. వేములవాడ‌లో మాత్రమే కనిపించే కోడె మొక్కులు ఇక్కడ కూడా కనిపిస్తుంది. శివరాత్రి రోజున భక్తులు కోడె మొక్కులు తీర్చుకుంటారు.

కృతయుగంలో రాముడు తన వనవాసం‌లో ఈ మందిరాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది. మహ శివరాత్రి రోజున గోదావరి నది తీరాన స్నానాలను ఆచరించి ఆ గంగా నీటిని తిసుకువచ్చి లింగాన్ని కడిగి పూజలు ప్రారంభించడం జరుగుతుంది. మహిమలు తిర్చే దేవుడిగా నాళేశ్వర్ రాజన్నను కొలుస్తారు. మహశివారాత్రి సందర్భంగా మూడు రోజులు పాటు ఆలయంలో పూజలు నిర్వహిస్తు,గంగా మూర్తులతో ఊరేగింపు చేస్తారు. శివరాత్రి మరుసటి రోజు వేలాది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఊరంతా.. పండగే..

నాళేశ్వర్ గ్రామంలో మహ శివరాత్రి పండుగ వచ్చిందంటే గ్రామంలో ఉన్న గ్రామస్థులు అంతా ఆంగరంగా వైభవంగా నిర్వహించుకుంటారు. శివరాత్రి రోజున ఊరు మొత్తం ఉపవాసం ఉండి స్వామివారి సేవలో నిమగ్నం అవుతారు. పండగకు వారం రోజుల ముందు నుండి ఏర్పాట్లు చేస్తారు.

ప్రతి సోమవారం ఊరు మొత్తం ఉపవాసం ఉండడం ఇక్కడి ప్రత్యేకత. తమ ఇంటి ఇలవేల్పులా కొలుస్తూ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ముందు రాజ రాజేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం గ్రామస్థుల ఆనవాయితీ.

మహిమాన్వితుడు.. మా రాజ రాజేశుడు

- మగ్గరి హన్మండ్లు(సోసైటి చైర్మన్)

మా గ్రామంలో స్వయంభూగా వేలసిన శ్రీ రాజ రాజేశ్వరుడు మహిమాన్వితుడు. ప్రతి శివరాత్రి కి వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. శివరాత్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశాము. శివరాత్రి కోసం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తాం. శివరాత్రి మరుసటి రోజున ఆన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

Advertisement

Next Story