- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హద్దు రాళ్లను స్వచ్ఛందంగా తీసేయాలి..
దిశ, భిక్కనూరు : 10 గుంటల భూమి ముమ్మాటికి వీడీసీదేనని, ఆ భూమిని ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాతిన హద్దులను తొలగించాలని, లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలోని ప్రజలే హద్దురాళ్ళను, కడీలను తీసేస్తారని మాజీ వైస్ ఎంపీపీ తాటిపాముల లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డిలు హెచ్చరించారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన వీడీసీ స్థలాన్ని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల క్రితం గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ప్రజల వద్ద నుంచి డబ్బులు పోగు చేసి 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారన్నారు. ఇకనైనా వీడీసీ స్థలాన్ని ఆక్రమించేందుకు పాతిన హద్దు రాళ్లను, కడీలను స్వచ్ఛందంగా లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ని ప్రజలే వాటిని తొలగిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగల భూమయ్య, మాజీ ఉపసర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, పెద్ద బచ్చగారి మహిపాల్ రెడ్డి, కల్లూరి సిద్ధ రాములు, గజ్జె సురేష్, నీల ఆంజనేయులు,మద్దూరి రవి, బత్తుల బాగులు,కేతి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.