- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
help : చిన్నారికి పెద్ద జబ్బు..ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
దిశ,బోధన్ : బుడిబుడి అడుగుల చిన్నారికి పెద్ద జబ్బు చేసింది. తల్లిదండ్రులదేమో సామాన్య కుటుంబం. కానీ లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో.. చేసేది లేక అందిన కాడికి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తూ.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్న ఒక్కగానోక్కా తమ చిన్నారిని కాపాడమని పాపగోని వినోద్ కుమార్ గౌడ్, రజిత దంపతులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తలా కొంత సాయం చేసి తమను ఈ గండం నుంచి గట్టెక్కిస్తారని ఆశగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
అందరితో కలిసి ఆనందంగా ఆడుకునే అభం,శుభం తెలియని చిన్నారి.. ప్రాణాంతక బోన్ మారో వ్యాధితో బాధపడుతోంది. కన్నవారు అష్టకష్టాలు పడుతూ స్థోమతకు మించి అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపుకు చెందిన పాపగోని వినోద్ కుమార్ గౌడ్, రజిత దంపతుల కూతురు పాపగౌని సుమనస వందిని,రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వీరివి. వినోద్ దంపతులు ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తూ.. బతుకు బండిని లాగుతున్నారు. ఇద్దరూ కష్టపడి ఒక్కగానోక్కా కూతురును కంటికి రెప్పలా సాకుతున్నారు. కానీ 20 రోజుల క్రితం సుమనస వందిని అనారోగ్యం బారిన పడింది . స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. సుమనస వందినికి రక్తసంబంధిత వ్యాధి లక్షణాలున్నాయని ,హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించడంతో.. హుటాహుటిన చిన్నారిని నిజామాబాదు లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో.. చిన్నారిని హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు చిన్నారి సుమనస వందినికి పరీక్షలు నిర్వహించి.. బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతుందని, చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని డాక్టర్లు తెలిపారు. గత 20 రోజుల నుంచి చికిత్సకు రూ.8నుంచి 9 లక్షలు ఖర్చయ్యాయని తల్లిదండ్రు వాపోతున్నారు. ఇన్నాళ్లూ ఎలాగోలా అప్పుచేసి నెట్టుకొచ్చామని, ప్రస్తుతం అప్పులిచ్చేవారు కూడా లేరని చిన్నారి తండ్రి వినోద్ ఆవేదన చెందుతున్నారు. దాతలు సాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు...
ఇప్పటికే చిన్నారి వైద్య ఖర్చులకు రూ. 8 లక్షలకు పైగా ఖర్చయిందని,ఇంకా 25 నుంచి రూ. 30 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారిని కాపాడుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు ఆత్రుత పడుతున్నారు. కానీ వ్యవసాయ భూములుగాని, స్థలాలు గానీ లేకుండా అంతంతమాత్రంగా ఉన్న వారి ఆర్థికస్థోమతను చూసి ఎలాగా అని భయపడుతున్నారు. ఆపన్నహస్తం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకొనే దాతలు చిన్నారి తండ్రి వినోద్ ఫోన్ పే నంబరు 8985866594 కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.