ఆ మేడమ్ ఎంబీబీఎస్ ఆ..? ఆర్ఎంపీ ఆ..? డాక్టర్ కాకపోతే హాస్పిటల్ బోర్డ్‌పై పేరెందుకో..

by Aamani |
ఆ మేడమ్ ఎంబీబీఎస్ ఆ..? ఆర్ఎంపీ ఆ..? డాక్టర్ కాకపోతే హాస్పిటల్ బోర్డ్‌పై పేరెందుకో..
X

దిశ,గాంధారి : అదో ప్రముఖ ప్రైవేటు వైద్యశాల. అయితే అక్కడ మాత్రం అందరి డాక్టర్లకు డెసిగ్నేషన్ తో పాటు రిజిస్టర్ నంబర్లు కూడా ఉన్నాయి. ఒక్కరికి తప్ప.. వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అందరూ ఎండీ, ఎంఎస్, అని తమ పేరు పక్కనే డెసిగ్నేషన్లు పెట్టుకోవడం సహజం అంతేకాకుండా అందులో అందరికీ డాక్టర్ పట్టా పొందినట్లు రిజిస్టర్ నంబర్లు కూడా ఉన్నాయి. కొసమెరుపు ఏమిటంటే ఇందులో ఒక డాక్టర్ కు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం తో కొందరు ఈ డాక్టర్ కాదా అన్న సంశయం లో పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆమెకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. ఈ మేడం గాంధారి లోని శ్రీ వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ లో ఎప్పుడు ఇక్కడ వైద్య సేవలు అందించేది కాదని వినికిడి. ఇందులో ఆ మేడంకు అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా....? అసలు డాక్టర్ ఏనా....? అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అసలు వాస్తవానికి డాక్టర్ గా పట్టా ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎందుకు వేయలేదు..

Advertisement

Next Story

Most Viewed