- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పాలనలో తెలంగాణ నంబర్ వన్
దిశ, ఆర్మూర్ : బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం లక్కోర గ్రామంలోని ఏఎన్ జీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పలువురు హాజరై మాట్లాడారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి వేముల మాట్లాడుతూ...కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ... నేడు దేశానికే ఆదర్శమైంది అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నంబర్ వన్ అయిందని,
దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. పదిలంగా ఉన్న తెలంగాణను తెలిసి పాడు చేసుకుంటామా అని, ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్,బీజేపీ నేతలవి బేకార్ మాటలని, వాళ్లు ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైన చెస్తారు అన్నారు. కష్ట కాలంలో ప్రజలను పట్టించుకోనివారు...నేడు అదే ప్రజలను ఓట్లు అడగడానికి వస్తూ.. అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన పాపానికి రైతులు కరెంట్ లేక గోస పడుతున్నారని, తెలంగాణ రైతులు అలా మోస పోవద్దని అక్కడి రైతులు ఇక్కడికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మరీ చెప్తున్నారని గుర్తు చేశారు.
23 ఏళ్లు ఒకే పార్టీ, ఒకే నాయకున్ని నమ్ముకున్న...
23 ఏళ్లు ఒకే పార్టీ, ఒకే నాయకున్ని నమ్ముకున్న కుటుంబం నాదని, ఎన్నడూ పదవుల కోసం పక్కకు చూడలేదని మంత్రి వేముల భావోద్వేగానికి లోనయ్యారు. గత 23 ఏళ్లుగా కేసీఆర్ మాట జవదాటకుండా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నామని, తన తండ్రి దివంగత వేముల సురేందర్ రెడ్డి పార్టీ కోసం ,ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. 23 ఏళ్లుగా పార్టీ కోసం కేసీఆర్ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టే ఆయనకు తాను అంటే ఇష్టమన్నారు. అందుకే కేసీఆర్ దయ వల్ల అసాధ్యం అనుకున్న
ఎన్నో అభివృద్ధి పనులు సాధ్యం చేసు కున్నామన్నారు. తాను ఈ ప్రాంతానికి చేస్తున్న మంచి తనకు ఎంతో ఆత్మ సంతృప్తి నిచ్చిందని, ప్రశాంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు. నేను పుట్టిన ఈ వేల్పూర్ గడ్డ నన్ను కడుపులో పెట్టుకొని కాపాడు కుంటున్నదని,రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు చూపించే ప్రేమే కారణమన్నారు. మీరిచ్చే ధైర్యం చూస్తుంటే..మూడో సారి భారీ మెజార్టీతో గెలుస్తా అనే ధీమా ఉన్నదని, ప్రజల ఆశీర్వాదం ,కార్యకర్తల అండ ఉన్నన్ని రోజులు బీఅర్ ఎస్ దే విజయమన్నారు.
మేనిఫెస్టోను కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి...
బీఅర్ఎస్ కార్యకర్తలు సైనికులవలె ప్రజల చేత ఓట్లు వేయించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి అన్నారు. ఈ దఫా ప్రజలకు మేనిఫెస్టో లో రూపొందించిన అంశాలను నాయకులకు, కార్యకర్తలకు క్లుప్తంగా వివరించారు.ఈ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుక వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల పై ఉందన్నారు. తనకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన వికలాంగ కుటుంబాలకు ,
కుల సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల మధ్యన చిన్న చిన్న విభేదాలు ఉంటే కేసీఆర్ కోసం,తన కోసం పక్కన పెట్టు గెలుపు కోసం పనిచేయాలినీ మంత్రి వేముల విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చైర్మన్ డాక్టర్ మధు శేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ ఎంబీ రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు కోటపాటి నరసింహానాయుడు, డాక్టర్ భాస్కర్ యాదవ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.