తెలంగాణ చరిత్ర, ఆనవాళ్లు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ కుట్ర

by Kalyani |
తెలంగాణ చరిత్ర, ఆనవాళ్లు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ కుట్ర
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాజముద్రను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ముగింపు సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై జాతీయ పతకాన్ని, పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాకతీయుల తోరణం, చార్మినార్ ను తొలగించడం తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఉన్న ప్రేమ పాలన మీద లేదని, ఉంటే రైతుల గురించి ఆలోచించేవారన్నారు. ఇప్పటివరకు రైతుబంధు, భరోసా ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతు కిరణ్ ,సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, ఎనగందుల మురళి, తదితరులు పాల్గొన్నారు.

Next Story