తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే : మంత్రి హరీష్ రావు

by Sridhar Babu |   ( Updated:2023-11-24 10:14:16.0  )
తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే : మంత్రి హరీష్ రావు
X

దిశ, ఎల్లారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రే అని హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొని మాట్లాడారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్ వరకు రోడ్​షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టబోతున్నారని, అనంతరం కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశామని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి గా ఏర్పాటు చేశామని,

ఈ పనులు వేగంగా నడుస్తున్నాయని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, భారాసా ఎమ్మెల్యే అభ్యర్థి జాజాల సురేందర్ కు ఓటేసి మరోసారి ఆశీర్వదించాలని రోడ్ షోలో ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో భారాస ప్రభుత్వం మూడోసారి ఏర్పడగానే 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్థిక సహాయం మూడువేల రూపాయలు, అసైన్డ్ భూములకు పట్టాలు అందించ బోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో గతంలో 3,000 ఇళ్ల నిర్మాణం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడగానే 10000 ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొన్నాము. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed