దిశ ఎఫెక్ట్​...పెర్కిట్ పాఠశాలలో హెచ్ఎం, టీచర్ సస్పెన్షన్

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్​...పెర్కిట్ పాఠశాలలో హెచ్ఎం, టీచర్ సస్పెన్షన్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికల పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు, హెచ్​ఎంను సస్పెండ్​ చేశారు. దిశ పత్రికలో ప్రచురితమైన వార్తలకు నిజామాబాద్ విద్యాశాఖ డీఈవో శనివారం స్పందించారు. పెర్కిట్ లోని ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల సంఘటనపై విద్యాశాఖ డీఈవో విచారణ చేసి ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆ పాఠశాలలో పని చేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు మీర్జా ఇబ్రహీం, పాఠశాల హెచ్ఎం ఆసియా సుల్తానా ఇద్దరిని జిల్లా విద్యాశాఖ డీఈవో సస్పెండ్ చేసినట్లు ఆర్మూర్ ఎంఈఓ పింజ రాజ గంగారం తెలిపారు.

Next Story

Most Viewed