రైతుల ఆశలపై కడగండ్ల వాన.. ఆందోళనలో రైతులు

by Mahesh |   ( Updated:2023-03-19 03:00:19.0  )
రైతుల ఆశలపై కడగండ్ల వాన.. ఆందోళనలో రైతులు
X

నిజామాబాద్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ మరికొన్ని చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. వేసవి వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏటా తోట పంటలకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. ఈ ఏడాది కూడా అదే కష్టాలు వడగండ్ల వాన రూపంలో మొదలయ్యాయి. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు ఉగాది మాసంలో వచ్చే మామిడితో పాటు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి వర్షాలు కురిశాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వాతావరణ శాఖ అధికారులు సూచించిన విధంగానే నిజామాబాద్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ మరికొన్ని చోట్ల వడగాళ్లు రాళ్ల వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా వాతావరణం మబ్బు కమ్ముకొని చల్లని వాతావరణంతో ఉండడం వల్ల రైతాంగం ఆందోళన చెందుతూ చేతికి వచ్చిన పంట నష్టపోయే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా వడగాళ్లతో రాళ్ల వర్షం కురుస్తుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని భీంగల్, డిచ్పల్లి ,నందిపేట్ మాక్లూర్, బోధన్ ఆర్మూర్, బాల్కొండ గాంధారి, నిజామాబాద్ రూరల్, తో పాటు వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిపిస్తుంది.

వాతావరణ శాఖ ముందస్తుగా రైతన్నలకు సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయి కన్నా భారీగా వర్షం కురవడంతో పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఉగాది మాసంలో వచ్చే మామిడితో పాటు వివిధ రకాల పండ్లు నెల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట భారీ వర్షంతో పాటు వడగాళ్లు రాళ్లతో కూడుకున్న వర్షం వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతాలు పిడుగులు పడ్డట్టు సమాచారం.

పిడుగు పడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు

నిజామాబాద్‌ నగరంలోని మాలపల్లిలో గల మద ర్ సా మహేదుల్-అష్రఫ్ వద్ద పిడుగు పడి ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం నిజామాబాద్ నగరంలో వడగళ్ల వాన కురిసిన విషయం తెలిసింది. సా యంత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపాటుకు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు గురైన విద్యార్థుల్లో ఫతుల్లా, రిజ్వాన్ అవార్, యూనుస్ ఉన్నారు.ఫతుల్లా పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.

బాధిత విద్యార్థులందరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జమీయత్ ఉలమా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మదర్సా నజామ్ హఫీజ్ మహమ్మద్ లయీఖ్ ఖాన్ వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులు నిజామాబాద్‌ నగరానికికు చెందిన వారు. విద్యార్థుల తల్లిదండ్రులు తరలిరావడంతో మాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయంత్రం ప్రార్థనల అనంతరం వర్షానికి కురిసిన వడగలను ఏరుకునేందుకు వెళ్లిన విద్యార్థులపై పిడుగు పడినట్టు సమాచారం.

Advertisement

Next Story