SP Sindhu Sharma : కేసులు పెండింగ్ లో ఉండకుండా చూడాలి..

by Sumithra |
SP Sindhu Sharma : కేసులు పెండింగ్ లో ఉండకుండా చూడాలి..
X

దిశ, భిక్కనూరు : కేసులు పెండింగ్ లో ఉండకుండా చూడాలని జిల్లా ఎస్పీ సింధూ శర్మ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆమె మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంతో పాటు, భిక్కనూరు పోలీస్ స్టేషన్ ను విజిట్ చేశారు. ఈ సందర్భంగా కేసులకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని కేసులు పెండింగ్ లో ఉండడంతో, అవి ఎందుకు అలా ఉన్నాయని, పోలీస్ అధికారులను ప్రశ్నించగా, పరిష్కారం కాని కొన్ని కేసులకు సంబంధించి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని వివరించారు.

హైవే పై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, వాహన తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు. సర్కిల్ స్టేషన్ తో పాటు, పోలీస్ స్టేషన్ కార్యాలయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ఆమె పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. గుడ్ పోలీసింగ్ అంటూ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు, భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై సాయి కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story