కాంగ్రెస్ లో చేరిన రాష్ట్ర మార్క్​ఫెడ్ చైర్మన్

by Sridhar Babu |   ( Updated:2024-03-01 16:01:46.0  )
కాంగ్రెస్ లో చేరిన రాష్ట్ర మార్క్​ఫెడ్ చైర్మన్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలం ఆదర్శ గ్రామమైన అంకాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మార్క్​ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కాంగ్రెస్​లో చేరాడు. సీఎం రేవంత్ రెడ్డిని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Next Story