తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : అడిషనల్ కలెక్టర్

by Aamani |
తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : అడిషనల్ కలెక్టర్
X

దిశ,భీంగల్ : వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సరఫరా పై స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రెటరీలను అడిషనల్ కలెక్టర్ అంకిత్ అదేశించారు. సోమవారం భీంగల్ మండలం మెండోరా గ్రామంలోని లాక్య తండాను అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా తండా లో నీటి ట్యాంక్ లను, పైప్ లైనలను ఆయన పరిశీలించారు. వేసవిలో ట్యాంకులు అన్ని వెంట వెంట శుభ్రపర్చాలని, షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు.

సరఫరాలో అంతరాయం కలిగితే నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని, ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.అనంతరం భీంగల్ పట్టణంలో నిర్వహించిన పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ల ట్రైనింగ్ ప్రోగ్రాం కు హాజరై పలు సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ శ్రీలత, ఎంపీఓ గంగ మోహన్ పీ. ఓ లు, ఏ. పీ. ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story