Womens T20 World Cup : స్కాట్లాండ్‌ను చిత్తు చేసిన విండీస్.. వరల్డ్ కప్‌లో బోణీ

by Harish |
Womens T20 World Cup : స్కాట్లాండ్‌ను చిత్తు చేసిన విండీస్.. వరల్డ్ కప్‌లో బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ గెలుపు ఖాతా తెరిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 99/8 స్కోరు చేసింది. ఐల్సా లిస్టర్(26), కెప్టెన్ బ్రైస్(25) పర్వాలేదనిపించగా.. మిగతా వారు తేలిపోవడంతో 100 పరుగుల్లోనే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో అఫ్టి ఫ్లెట్చెర్(3/22) సత్తాచాటింది. అనంతరం ఛేదనలో మొదట్లో విండీస్ తడబడింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(8), టేలర్(4), కాంప్‌బెల్లె(2) నిరాశపరిచారు. అయితే, కియానా జోసెఫ్(31), డియాండ్రా డాటిన్(28 నాటౌట్), హెన్రీ(18 నాటౌట్) ధాటిగా ఆడటంతో 11.4 ఓవర్లలోనే విండీస్ విజయం లాంఛనమైంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. స్కాట్లాండ్‌పై గెలుపుతో ఆ జట్టు సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Advertisement

Next Story

Most Viewed