సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వర్షాకాలంలోగా పూర్తి చేయాలి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

by Sumithra |
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వర్షాకాలంలోగా పూర్తి చేయాలి : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్, కాలువల నిర్మాణ పనులను వర్షాకాలం నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రిజర్వాయర్ పనులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పనులు కావడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ప్రత్యేక టాప్ లెస్ వాహనంలో కలెక్టర్ తో కలిసి రిజర్వాయర్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టల మధ్యన నిర్మాణం అవుతున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ వల్ల చేకూరే ప్రయోజనాల గురించి, దాని ఆవశ్యకతను స్పీకర్ పోచారం కలెక్టర్ కు తెలియజేశారు. ఎలాంటి సాగునీటి వసతి లేని తండాలు, అంతకుముందు సంబంధిత అధికారులతో రిజర్వాయర్ పనుల ప్రగతి పై స్పీకర్, కలెక్టర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలోనే సమీక్ష జరిపారు. పనులను వేగవంతంగా చేపడుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పీకర్ దిశానిర్దేశం చేశారు. వీరి వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ వికాస్ మీనా, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఆర్ అండ్ బీ ఎస్. ఈ రాజేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement

Next Story