- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాన్స్‌ఫార్మర్ దొంగలను త్వరలోనే పట్టుకుంటాం..
దిశ, పిట్లం : జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు జరుగుతున్నాయని, ఆ దొంగలను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి విలేకరులతో తెలిపారు. గురువారం పిట్లం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లోని రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ లు, ఆయిల్ కాపర్ వైర్లను దొంగలించిన దొంగలను త్వరలోనే పట్టుకొనితీరుతామని అన్నారు. పిట్లం మండలం, తాడ్వాయి మండలంలో జరిగిన దొంగతనాల్లో పాల్గొన్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకుంటామన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడానికి వీలుంటుందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో సర్పంచులు చర్యతీసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఈనెల 13న జరిగే కేటీఆర్ సభా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, ఎస్బీ సీఐ రాంబాబు, స్థానిక ఎస్సై విజయ్ కొండ, నిజాంసాగర్ ఎస్సై రాజు, స్థానిక నాయకులు వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, అన్నారం వెంకట్రాంరెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి , ప్రతాపరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.