బీఆర్ఎస్‌లో ఉంటూ కాంగ్రెస్ కోవర్టు‌లుగా పనిచేశారు: వేణుగోపాల్ రావు

by Mahesh |
బీఆర్ఎస్‌లో ఉంటూ కాంగ్రెస్ కోవర్టు‌లుగా పనిచేశారు: వేణుగోపాల్ రావు
X

దిశ, కామారెడ్డి క్రైమ్: బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు కాంగ్రెస్ పార్టీ కోవర్టులుగా పనిచేశారని పార్టీ ప్రతిష్ట దెబ్బతినడానికి సొంత పార్టీ నేతలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి తండ్రి నీట్టు వేణుగోపాలరావు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈనెల 11న అవిశ్వాస నోటీసు ఇచ్చిన తర్వాత 13వ తేదీన నేను టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబొద్దిన్‌ను కలవడం జరిగిందన్నారు. తమ పార్టీలో ఉన్న 16 మందిని కాపాడుకుంటే చైర్మన్ పీఠం ఎక్కడికి వెళ్లదు అని చెప్పడం జరిగిందన్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో చర్చించి చెప్తా అని ఆయన పేర్కొని నిర్లక్ష్యం చేశారని, నాలుగు రోజులు అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం చందుకు ముజీబుద్దిన్ ఫోన్ చేసి తనపై ఒత్తిడి పెరుగుతుందని తన పార్టీలో ఉన్న కౌన్సిలర్లను తీసుకెళ్లాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

మరుసటి రోజు తాను నియోజకవర్గ ఇన్చార్జ్ గంప గోవర్ధన్ వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పగా మీటింగ్ అవసరం లేదని ఏదైనా ఉంటే నీ ప్రయత్నం చేసుకొని నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు తెలిపారు. అయితే 8 మంది కౌన్సిలర్లను తాను సముదాయించి మాట్లాడితే ముజీబుద్దిన్, గంప గోవర్ధన్‌తో చెప్పిస్తే తాము క్యాంపుకు వెళ్లడం మానుకుంటామని తమని బెదిరింపులకు గురి చేయడంతో వెళ్ళక తప్పడం లేదని వారు పేర్కొన్నట్లు చెప్పారు. ఈ విషయాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకి వెళ్లి చెప్తే ఆయన వెంటనే గంప గోవర్ధన్, ముజీబుద్దిన్ లకు ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఆయన మాటను సైతం వీరు లెక్క చేయలేదన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తాను బీజేపీలో చేరుతున్నానని దుష్ప్రచారం సైతం చేయడం జరిగిందని తాను బీఆర్ఎస్‌ను వీడేది లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా రేపటి జహీరాబాద్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశానికి ఇప్పటికీ నాకు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలు మున్సిపల్ అభివృద్ధికి కృషి చేసినందుకు అవకాశం కల్పించిన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూన్ననాని పార్టీలో ఉంటూ పార్టీ పతనానికి పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story