డోర్ కర్టన్‌తో ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

by S Gopi |
డోర్ కర్టన్‌తో ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
X

దిశ, నిజామాబాద్ క్రైం: కడుపునొప్పి భరించలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ గల వైష్ణవి రెసిడెన్సీలో తన ఇంట్లో పెంట అనీష్ (31) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న అనీష్ మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు డోర్ కర్టన్ తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మృతుడు తమ్ముడు అరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story