పాపం అంటే మన భవిష్యత్ ప్రశ్నార్థకం

by Sridhar Babu |
పాపం అంటే మన భవిష్యత్ ప్రశ్నార్థకం
X

దిశ, భీంగల్ : హిందువులు అన్ని విషయాల్లో, అన్ని స్థితుల్లో పాపం అంటుంటుంటారని, ఆలా పాపం అంటే మన భవిష్యత్తు, మన తరం వాళ్లకు ప్రశ్నార్థకం అవుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రంలోని హిందూ, ముస్లింల వివాదాస్పద స్థలాన్ని ఎంపీ సందర్శించారు. ఈ సందర్బంగా స్థల వివాదం గురించి స్థానిక వీడీసీ సభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నిబంధనలను తుంగలో తొక్కి ఈద్గా వద్ద ముస్లిం కమ్యూనిటీ భవనం

అక్రమంగా కట్టడం చేస్తుంటే అడ్డుకున్నోళ్ల పై కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. అధికారులు నిబంధనలను పాటించని వాళ్లకు వత్తాసు పలకడాన్ని ఆయన తప్పుబట్టారు. ముస్లింలు అక్రమంగా చేపడుతున్న కట్టడాన్ని ఆపి దాన్ని తొలగించాలని, లేని పక్షంలో బుల్డోజర్ తో తొలగించాల్సి వస్తుందన్నారు. కేసులు అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాను కూడా అవసరమైతే జైలుకు వస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తాను ఈ విషయమై కలెక్టర్ ను కలుస్తానన్నారు. వేల్పూర్ లోనే కాదు జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి విషయాలను హిందువులు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఆయన వెంట వేల్పూర్ గ్రామ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story