నారా లోకేష్ అమెరికా పర్యటన ఖరారు

by M.Rajitha |   ( Updated:2024-10-10 17:35:24.0  )
నారా లోకేష్ అమెరికా పర్యటన ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ఖరారైంది. అక్టోబర్ 25 నుండి నవంబర్ 1 వరకు అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కో లో లోకేష్ పర్యటించనున్నారు. అమెరికాలో జరిగే ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కు హాజరవనున్నారు. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా.. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. కాగా లోకేష్ వెంట ఇంకా ఏయే నాయకులు వెళ్తారనే సమాచారం మాత్రం తెలియరాలేదు. పర్యటన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed