- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రండి బాబు రండి..మీ వాడకట్టుకొచ్చినం..కల్లు కొనుక్కోవాలయ్యా
దిశ భిక్కనూరు : మీ ఇంటికే వచ్చాం..మీ వాడకే వచ్చాం...కల్లమ్మ కల్లు... అంటూ వెరైటీగా కార్లలో తిరుగుతూ... అమ్మకాలు పెంచేందుకు ముస్తేదారు పడుతున్న తపన అంతా ఇంతా కాదు.ఇప్పటివరకు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ అల్లం ఎల్లిగడ్డ తో పాటు,ఉల్లిగడ్డ, మసాలా పొట్లాలు,ముగ్గు, కొబ్బరి బోండాలమ్మ కొబ్బరి బొడ్డలంటూ మైకు పెట్టుకొని ఇండ్ల వద్దకే వచ్చి విక్రయించడం చూసాం. కానీ ఆ గ్రామంలో మాత్రం ఇంటింటికి తిరుగుతూ కల్లు విక్రయిస్తున్నారు. ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా.. భిక్కనూరు మండలం కాచాపూర్‌లో ఇద్దరు వ్యక్తులు కారులో ఇంటింటికి వెళ్తూ కల్లు అమ్ముతున్నారు. ‘రండి బాబు రండి.. మీ వాడకట్టుకొచ్చినం.. మీ ఇంటి కాడికొచ్చినం.. కల్లు కొనుక్కోవాలయ్యా.. అంటూ’ మైక్‌లో అనౌన్స్ చేస్తుండడంతో ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. బట్టీకి వెళ్లి కల్లు సీసాలు తెచ్చుకునే రోజుల నుంచి.. ఇంటి వద్దకే వచ్చే రోజులచ్చాయంటూ ఆ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.