- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పై షబ్బీర్ అలీ సమీక్ష
దిశ, కామారెడ్డి : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను ఎలాగైనా పూర్తి చేసి జిల్లాలోని రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాళేశ్వరం ప్యాకేజీ 20.21.22.(ప్రాణహిత చేవెళ్ల) ప్రాజెక్టు పనులను పూర్తి చేసి కామారెడ్డి జిల్లాలోని రైతులకు రెండు లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించగా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి, షబ్బీర్ అలీ కి పేరు వస్తుందని కక్ష కట్టి, ఎలాంటి నిధులు విడుదల చేయకుండా తొక్కి పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఎట్టి పరిస్థితుల్లోనైనా తాను కలలుగన్న ప్రాజెక్ట్ ప్రాణహిత చేవెళ్ల 20,21,22 పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రతిరోజు అధికారులతో, ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రాజెక్టు విషయంలో చర్చలు జరుపుతున్నానన్నారు. ఇందులో భాగంగానే ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఈఈ మల్లేష్, పోచమల్లు బృందంతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం చే నిధులు మంజూరు చేయించి ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు.