సీఎం కేసీఆర్ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ చేసి పాత పెన్షన్ అమలు చెయ్యాలి..

by Sumithra |
సీఎం కేసీఆర్ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ చేసి పాత పెన్షన్ అమలు చెయ్యాలి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు వెంటనే స్పందించి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ - 2022, 1999 నుండి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నమాదిరిగా పాత పెన్షన్ అమలు చెయ్యాలని ఆర్టిజన్స్, సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ లో విద్యుత్ ఉద్యోగుల 6వ సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ర్ట జేఎసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ పి.రత్నాకర్ రావు, కో-చైర్మన్ శ్రీధర్, కో - కన్వీనర్ - శ్రీనివాస్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ లు మాట్లడుతు.. 2022 ఎప్రిల్ 1 నుంచి విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన వేతన సవరణ గత సంవత్సర కాలం నుండి అమలు చెయ్యకపోవడం దీనికి యజమాన్యము, ప్రభుత్వం చేసిన కాలయాపన మాత్రమే అన్నారు. 1999 నుండి 2004 వరకు నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని గత కొన్ని సంవత్సరాల నుండి అన్ని సంఘాల, అసోసియేషన్స్ కూడా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో గాని, దేశంలో ఏ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ లో కానీ 2004 వరకు పాత పెన్షన్ సౌకర్యం ఉందని ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే లేదు కాబట్టి ఎలాగైనా ఈ సారి 1999 నుండి 2004 వరకు నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని జేఎసీ నాయకులు కోరారు.

ఆర్టిజన్ కార్మికులు చాలీ చాలని జీతాలతో బాధపడుతున్నారు. కాబట్టి ఆర్టిజన్స్ ను కూడా జీతం కొంత ఎక్కువ పీఆర్సీ ప్రకటించి వాళ్ళను ఆదుకోవాలని, వాళ్లకు రావాల్సిన కొన్ని అలవెన్సుస్ కానీ మెడికల్ పాలసీ ఉద్యోగుల మాదిరిగా వాళ్లకు కూడా సంతృప్తి పరచాలని కోరారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి యాజమాన్యం నుండి గాని ఎటువంటి పిలుపు రాలేదని, మేము మాత్రం చర్చలకు సిద్ధమని మాకు సమ్మె చెయ్యాలని, ప్రజలను వినియోగదారులను ఇబ్బంది పెట్టాలని మాకు లేదని అటువంటి పరిస్థితి రాకుండా చెయ్యాలని దీని పూర్తిగా ప్రభుత్వం, యాజమాన్యమె బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర జేఎసీ నుండి గోవర్ధన్, వెంకటేశ్వర్లు, సదానందం, ప్రభాకర్, వెంకట నారాయణ రెడ్డి, కుమార స్వామి, ఈశ్వర్ రావు, అంజయ్యతో పాటు నిజామాబాద్ జేఎసీ నుండి రఘునందన్, రాజేందర, బాలేష్ కుమార్, గంగాధర్, రాజశేఖర్, శివకుమార్, నాంపల్లి సురేష్ , శ్రీనివాస్, సుమితా, రాంసింగ్, కామారెడ్డి జిల్లా నుండి బ్రహ్మం, నంద కుమార్, సంపత్ రెడ్డి, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed