- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ పోలీసులకు ఏమైంది.. పోలీసు శాఖలో ఏం జరుగుతోంది ?
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజలకు సమస్యలొస్తే పోలీసుల దగ్గరికి వెళతారు.. ఏ కష్టమొచ్చినా ఎంత నష్టమొచ్చినా ఎలా ధైర్యంగా బతకాలో పోలీసులు జనాలకు మోటివేట్ చేస్తారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నవారి మనసు మార్చి జీవితంపైన భరోసాను కలిగిస్తారు. జీవితమంటే ఏమిటో జీవిస్తేనే తెలుస్తుందని.. తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్యలు శాశ్వత పరిష్కారాలు కావని చైతన్య పరుస్తారు. బాధల్లో ఉన్న వారికి భరోసానిచ్చి జీవితం పై ఆశలు కల్పిస్తారు. అందుకే పోలీసులను ప్రజలు ఇంతగా నమ్ముతారు.. గౌరవిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో ఆ పోలీసుల జీవితాలే ప్రమాదంలో పడుతున్నాయి. సమస్యలను ధీటుగా ఎదుర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండటం పోలీసు శాఖనే కాదు.. యావత్ సమాజాన్ని నివ్వెరపరిచేలా చేస్తోంది.
పోలీసు శాఖకు దెబ్బమీద దెబ్బలా..
కామారెడ్డి జిల్లాలో ఈ నెల 25 న రాత్రి చోటు చేసుకున్న ట్రిపుల్ డెత్ కేసు విచారణ ఓ పక్కకొనసాగుతుండగానే మరో పక్క తాజాగా మెదక్ జిల్లాలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హెడ్ కానిస్‌టేబుళ్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ లు సదాశివనగర్ మండల పరిధిలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలం సృష్టించింది. ఈ ఘటన నుంచి పోలీసు శాఖ తేరుకోక ముందే తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు పోలీసు శాఖను మరింత కుదిపేశాయని చెప్పొచ్చు. ఈ ఆత్మహత్యల వెనక కారణాలను ప్రజల్లో వినిపిస్తున్న ఆరోపణలను విశ్లేషిస్తే వీరికి పరాయి మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే వీరి ఆత్మహత్యలకు కారణాలనే ఆరోపణలున్నాయి.
ఎంత వారలైనా కాంత దాసులేనా..?
పోలీసులంటే సమాజంలో ఎంతో గౌరవం ఉంది. ఆ శాఖ అనేదే లేకపోతే సమాజంలో శాంతి భద్రతలు ఆర్డర్ లో ఉండవు. సమాజంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పకుండా ఉండాలంటే ముందుగా పోలీసులు గాడి తప్పకూడదు. వారు గాడి తప్పకుండా ఉంటేనే న్యాయం ధర్మం, శాంతి భద్రతలు ఆర్డర్ లో ఉంటాయి. కానీ పోలీసులు ఇటీవలి కాలంలో పరస్త్రీల సాంగత్యానికి వెంపర్లాడుతూ తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో సూసైడ్ చేసుకున్న భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట్ ఉమెన్ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ ల మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీనే వారి ఆత్మహత్యలకు కారణమైందన్న విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కాటూరి సాయికుమార్ ఆత్మహత్య వెనక కూడా దివ్య అనే ఓ మహిళతో సాయికుమార్ కు ఉన్న పరిచయమే ఆయన ప్రాణాల మీదికి తెచ్చిందని తెలుస్తోంది. గతంలో సిద్ధిపేట్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో సూసైడ్ చేసుకున్న ఎస్ఐ, గత నెలలో ములుగు జిల్లా వాజేడులోని హరిత రిసార్ట్ లో తన సర్వీస్ రివాల్వర్ తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న రుద్రారపు హరీష్ కుమార్ సూసైడ్ వెనక కూడా ఓ పరాయి మహిళతో ఉన్న సంబంధమే కారణమన్నది స్పష్టమైంది. ఇలా పోలీసుల ఆత్మహత్యల వెనక కారణాలను విశ్లేషిస్తే పరాయి మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే వీరి ఆత్మహత్యలకు కారణాలుగా మారుతున్నాయి.
పోలీసులకు పరస్త్రీతో అక్రమ సంబంధాల పై ఎందుకింత మక్కువ ?
అక్రమ సంబంధాల పై ఈ మధ్య కాలంలో చాలా మంది మానసిక నిపుణులు, మేధావులు, తత్వవేత్తలు, చాగంటి వంటి ప్రముఖులు ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు పోలీసులు కూడా అడపా దడపా ఏర్పాటు చేస్తున్న కళాజాత వంటి కార్యక్రమాల్లో మూఢ నమ్మకాలు, గల్ఫ్ మోసాలు, సైబర్ నేరాలు వంటి నేరాల పై అవగాహన కల్పిస్తూనే అక్రమ సంబంధాలపైనా, వాటి వల్ల కలిగే అనర్థాలపైనా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యపరుస్తున్నారు. కానీ, పది మందికి వెలుగునిచ్చే దీపం అడుగున చీకటి ఉంటుందన్న చందంగా కొంత మంది పోలీసులే పరస్త్రీల పట్ల వ్యామోహంతో తమ విచక్షణను, తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ? అనే విషయాల పై ఉన్నతాధికారులు ఆలోచించకపోవడం, తమ శాఖలోని అధికారుల్లో ఉన్న పర స్త్రీ వ్యామోహపు మకిలీకి మందు వేయకపోవడంతో పోలీసుల్లో ఈ రుగ్మత ముదిరిపోయి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల్లో పని ఒత్తిడులే కారణమా ?
ఇటీవలి కాలంలో పోలీసులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనకు కారణం పరస్త్రీలతో సాంగత్యమే కారణమని తెలుస్తున్నప్పటికీ, దీనికి తోడు మరో కోణం కూడా కారణం కావొచ్చనే అనుమానాలు పోలీసు శాఖలోనే వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో పొలిటికల్ ప్రోటోకాల్ తో పాటు, బందోబస్తు డ్యూటీలు, ఉన్నతాధికారుల నుంచి శాఖాపరమైన ఒత్తిళ్లు, పొలిటికల్ లీడర్లతో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎస్ఐ, సీఐ ఆపై స్థాయి అధికారులకు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి కారణంగా మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న పోలీసులు స్వాంతన కోసం తమకు అందుబాటులో ఉన్న పరాయి మహిళలతో పరిచయాలకు ప్రేరేపిస్తున్నాయని, ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధాలకు దారితీస్తోందని, పోను పోను ఆ బంధాలే పోలీసులకు యమపాశాలవుతున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులు చొరవ తీసుకోకపోతే ప్రమాదం ?
నిజానికి పోలీసు శాఖ ఇప్పుడు ప్రమాదంలో పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పోలీసు శాఖలో చాలా మంది పరస్త్రీలతో సంబంధాలు కలిగి ఉన్నారని తెలుస్తోంది. వీటిలో ఇప్పటి వరకు బయటకు వచ్చినవి కొన్నయిలే బయట పడని రహస్య సంబంధాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఉన్నతాధికారులు ఇప్పుడైనా తేరుకుని నష్ట నివారణ చర్యలకు చొరవ చూపకపోతే పోలీసు శాఖ పరువు మూసీ నదిలో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. పోలీసుల కదలికలపైనా, వారికి ఉన్న రహస్య సంబంబంధాలపైనా నీడలా ఓ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముంది. ఇప్పటికైనా పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా, ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కొనేలా మానసికంగా సిద్ధం చేయడానికి ప్రముఖులచేత కౌన్సిలింగ్ క్లాసులు, మోటివేట్ క్లాసులు ఇప్పించాల్సిన అవసరముంది. ఈ విషయంపై పోలీసు శాఖతో పాటు ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరమెంతైనా ఉంది.