Allu Aravind: అల్లు అరవింద్‌కు నలుగురు కొడుకులు ఉన్నారా.. నాలుగో కొడుకు ఎక్కడ?

by Prasanna |   ( Updated:2025-01-02 07:40:58.0  )
Allu Aravind: అల్లు అరవింద్‌కు నలుగురు కొడుకులు ఉన్నారా.. నాలుగో కొడుకు ఎక్కడ?
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప 2. ఇది ఎంత పెద్ద హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ సినిమాల్లో సరైన సక్సెస్ ఇప్పటికీ అందుకోలేదు. పలు సినిమాల్లో నటించినా శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క హిట్ పడలేదు. అయితే, అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయం చెప్పి షాక్ ఇచ్చాడు.. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అల్లు శిరీష్ ఆలీ తో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ప్రపంచానికి తెలియని ఒక వాస్తవాన్ని ఆలీ అడిగాడు. అల్లు అరవింద్‌కు ఎంత మంది పిల్లలున్నారని అడగగా .. తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని శిరీష్ చెప్పాడు. .. మొన్నటివరకు ఇద్దరు నుంచి ముగ్గురు అనే నిజం తెలిసింది. ఇక ఇప్పుడేమో నలుగురు అంటున్నారు. దీనిలో వాస్తవమెంత అని ఆలీ అడిగాడు. అప్పుడు శిరీష్ " అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్, అల్లు శిరీష్.. ఇలా మా నాన్నకు నలుగురు సంతానం. తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడు, అందుకే, అన్న గురించి ఎప్పుడు, ఎక్కడా ప్రస్తావించలేదు.. అల్లు అరవింద్ కూడా ఎక్కడా చెప్పుకోలేదని " తన మాటల్లో చెప్పుకొచ్చాడు.


Also Read...

అల్లు అర్జున్ కేసులో కీలక పరిణామం.. తెలంగాణ డీజీపీకి NHRC నోటీసులు

Advertisement

Next Story

Most Viewed