Ap News: విద్యార్థినిపై అత్యాచారయత్నం.. నిందితుడిపై పోక్సో కేసు

by srinivas |
Ap News: విద్యార్థినిపై అత్యాచారయత్నం.. నిందితుడిపై పోక్సో కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్ విద్యార్థిని(Inter Student)పై కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా(Krishna District)లో జరిగింది. ఉయ్యూరు మండలం ఆకునూరు అంబేద్కర్ నగర్‌(Akunur Ambedkar Nagar)లో స్థానిక విద్యార్థినిపై కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం(Car driver Subrahmanyam) కన్నేశాడు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు సుబ్రహ్యణ్యం అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి కుటుంబం వెంటనే 112కు కాల్ చేశారు. ఫోన్ చేసిన నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి వివరాలు సేకరించారు. నిందితుడు సుబ్రహ్మణ్యంపై పోక్సో చట్టం కింద కేసు(POCSO Case) నమోదు చేశారు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యం కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed