కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

by Sridhar Babu |
కామారెడ్డి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
X

దిశ, భిక్కనూరు : సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. ప్రజల కష్టాలు, సమస్యలు ఏవైనా ఉంటే తన కోసం టైం వేస్ట్ చేసుకోకుండా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ మేరకు మేజర్ గ్రామపంచాయతీలకు మూడు నాలుగు ఫిర్యాదు పెట్టెలతో పాటు మిగతా గ్రామాలకు ఒక్కొక్క పెట్టెను పంపించారు. ఈ మేరకు భిక్కనూరు మండల బీజేపీ నాయకులతో పాటు, అన్ని గ్రామాల నాయకులకు ఫిర్యాదు పెట్టాలను పంపి

శనివారం సాయంత్రం వరకు ప్రధాన కూడళ్ల వద్ద అమర్చనున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు శుక్రవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన్ని కలిసిన స్థానిక బీజేపీ నాయకులతో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా ఫిర్యాదు పెట్టెలను వారం పది రోజులకు ఒకసారి తానే స్వయంగా వచ్చి తీసుకెళ్తానని ప్లాన్ కూడా చేసుకున్నట్లు దిశతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తానికి రోడ్డు కోసం దగ్గరుండి ఇల్లు కూల్చి వేయించిన ఆయన ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వారి అభిమానం చూరగొనే విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు పెట్టె ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం మరో సెన్సేషన్ కు దారి తీయనుంది.

Advertisement

Next Story

Most Viewed