- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM రేవంత్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే కుట్ర.. కాంగ్రెస్ ఎంపీ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)లపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(Mallu Ravi) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలనే కుట్ర పూరితంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మూసీ విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు నెరవేర్చామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిలో విప్లవ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీది.. బ్రాహ్మణ సామాజికవర్గం అయినప్పటికీ ఈ దేశంలో ఉన్న దళిత, గిరిజన, బడుగు వర్గాల ఆశాజ్యోతిగా పేరు ప్రతిష్టలు పొందిందని గుర్తుచేశారు. నేటికీ ఆమె పేరు ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటుందని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిత్యం పేదల కోసమే ఆలోచించే వ్యక్తి అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు పదవులపై ఉన్న సోకు ప్రజలపై లేదని అన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోవడంతో తట్టుకోలేక ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారనివి మర్శించారు.