అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే.. ఆసక్తికరంగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్

by Hamsa |   ( Updated:2024-10-11 14:35:48.0  )
అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే.. ఆసక్తికరంగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddharth), రుక్మిణి వసంత్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(Appudo Ippudo Eppudo). అయితే సడెన్‌గా ఈ మూవీ పోస్టర్‌ను నిఖిల్ ఇటీవల షేర్ చేసి షాకిచ్చారు. అయితే ఈ మూవీని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ(Sudhir Verma) దర్శకత్వంలో రాబోతుంది. సైలెంట్‌గా షూటింగ్ జరుపుకున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(Appudo Ippudo Eppudo) మూవీ నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ మేకర్స్ హైప్ పెంచుతున్నారు.

తాజాగా, నిఖిల్ (Nikhil Siddharth) ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ దసరా(Dussehra) కానుకగా విడుదలైంది. అయితే ఇందులో నిఖిల్ రేసర్‌గా నటించాడు. ఇందులో లవ్ స్టోరీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్‌లో ‘‘అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే’’ అని నిఖిల్ చెప్పే డైలాగ్స్ హైలెట్‌గా మారాయి. కాగా, ఈ సినిమా దీపావళి(Diwali) కానుకగా నవంబర్ 8న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.


Advertisement
Next Story

Most Viewed

    null