Mohammed Siraj : డీఎస్పీగా మహ్మద్ సిరాజ్ నియామకం.. పత్రాలు అందజేసిన రాష్ట్ర డీజీపీ

by Ramesh N |
Mohammed Siraj : డీఎస్పీగా మహ్మద్ సిరాజ్ నియామకం.. పత్రాలు అందజేసిన రాష్ట్ర డీజీపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి (డీఎస్పీ) ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డీఎస్పీ పోస్టును మహ్మద్ సిరాజ్‌కు కేటాయించారు. ఈ మేర‌కు రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం, పోలీసు శాఖ‌కు సిరాజ్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గతంలోనే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, టీ 20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. సీరాజ్‌ను సీఎం ఘనంగా సన్మానించి.. క్రికెట్‌‌లో భారత్‌కి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడంటూ సిరాజ్‌ను సీఎం అభినందించారు. కాగా, సిరాజ్‌తో పాటు తెలంగాణ స్టార్ ప్లేయర్స్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్‌లకు కూడా ప్రభుత్వం ఇంటి స్థలం, గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. ఇటీవల బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీ(స్పెషల్ పోలీస్‌) గా నియామక పత్రాలు అందుకుంది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ 2024 క్రీడల కార్యక్రమంలో యూనిఫామ్ ధరించి వచ్చిన నిఖత్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాఠీని అందుకున్నారు.

Advertisement

Next Story