ఏర్గట్ల మండలంలో గంజాయి స్వాధీనం..

by Sumithra |
ఏర్గట్ల మండలంలో గంజాయి స్వాధీనం..
X

దిశ, ఏర్గట్ల : మండలంలోని తడపాకల్ గ్రామంలోని గోదావరి నది తీరాన రామాలయం శివారులో శుక్రవారం గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎస్సై రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొన్నారు. అంతలోనే ఇద్దరు నిందితులు అప్రమత్తమై పారిపోవడానికి ప్రయత్నించగా, చాక చక్యంతో వారిని పట్టుకొని విచారించారు. అనంతరం వారి వద్ద 2 పాలిథిన్ కవర్ బ్యాగులను గుర్తించి పరిశీలించగా అందులో 400 గ్రాముల పొడి గంజాయి పట్టుబడినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితులు కోరుట్ల మండల కేంద్రం భీముని దుబ్బకు చెందిన పూసల వెంకటేష్ (22), కోరుట్ల మండలం గాంధిరోడ్ కు చెందిన గొడికె నవీన్ (22) లుగా గుర్తించారు.

వీరు నిర్మల్ నుండి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. అనంతరం తహసిల్దార్ భింగి జనార్ధన్ కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఎండు గంజాయిని స్వాధీన పరిచి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు, కోర్టుకు పంపినట్లు తెలిపారు. గంజాయి లాంటి మాదకద్రవ్యాలు అమ్మిన గాని, వారికి సహకరించిన గాని చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయని ఈ సందర్భంగా ఎస్సై కొరెడె రాజు పేర్కొన్నారు. ఈ కేసుకు కృషి చేసిన ఎస్ఐ రాజు, ఏఎస్ఐ ఇస్మాయిల్, కానిస్టేబుల్ విజయ్, గంగాధర్, హోంగార్డు జగదీష్ లను సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed