- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష రూపాయలు దోచుకెళ్లిన నకిలీ పోలీస్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో నకిలీ పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. పోలీసులమని చెప్పి లక్ష రూపాయలను కేటుగాళ్ళు దోచుకేళ్లారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సపూర్ వద్ద జరిగింది. మండలంలోని పోచంపాడ్ ఎస్బీఐ బ్యాంకు నుండి లక్ష నగదును డ్రా చేసుకుని వస్తున్న మల్లయ్యను దొంగలు ఆపారు. తాము పోలీసులమని చెప్పి లక్ష రూపాయల గురించి ఆరా తీశారు.
డబ్బులకు సంబధించిన వివరాలను పోలీసు స్టేషన్ కి వచ్చి చూపించి డబ్బులు తీసుకెళ్లని బాధితునికి తెలిపారు నకిలీ పోలీసులు. తీరా పోలీసు స్టేషన్ కి వెళ్లగా వారు నకిలీ పోలీసులు అని తెలుసుకొని లబోదిబోమంటున్నాడు బాధితుడు మల్లయ్య. ఈ మేరకు మెండోరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ టీవి పుటేజీలను పరిశీలిస్తున్నారు.