- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్కారు నౌకరి వచ్చిన కొద్ది రోజులకే మృతి..అసలేం జరిగిందంటే..?
దిశ ,నాగిరెడ్డిపేట్ : కొలువులో చేరిన కొద్ది రోజులకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మండలంలోని మాసానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాసానిపల్లి గ్రామానికి చెందిన వరిగే నర్సింలు కుమారుడు యాదగిరి కామారెడ్డిలోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి చదివేవాడు. నాలుగు నెలల క్రితం వెలువడిన గురుకుల పాఠశాల ఫలితాలలో ఉద్యోగం సాధించి.. లింగంపేట్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపూలే పాఠశాలలో విధులు నిర్వహించాడు. విధులు నిర్వహించుకుంటూ డీఎస్సీ పరీక్ష రాయడంతో.. ఇటీవల వెలువడిన డిఎస్సీ ఫలితాలలో గణిత విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాడు. లింగంపేట్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాడు. ఇంతలో బైకు యాక్సిడెంట్లో తలకు బలమైన గాయాలు కావడంతో.. ఆపరేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఫుడ్ పాయిజన్ కావడంతో.. హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిర్వహిస్తుండగా.. మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులో నుంచి నర్సింలు ఎంతో కష్టపడి పిల్లలను ఉన్నతస్థాయికి తెచ్చారు. పరిస్థితుల ప్రభావాల వల్ల ఆయన కన్న కలలు నిరాశలయ్యాయి. యాదగిరి మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తోటి స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.