సంస్కృతిని తెలియజేయడానికే సంక్రాంతి పండుగ

by Sridhar Babu |
సంస్కృతిని తెలియజేయడానికే సంక్రాంతి పండుగ
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేయడానికే సంక్రాంతి పండుగ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గురువారం మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

సంక్రాంతి సందర్భంగా మహిళలు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తారని తెలిపారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొనడం శుభసూచకమన్నారు. మొదటి బహుమతిని రాజ్యలక్ష్మి బృందం, ద్వితీయ బహుమతి సరళ బృందం, తృతీయ బహుమతి రోజా రాణి బృందం ప్రతినిధులు అందుకున్నారు. ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిని రజిత వ్యవహరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి బి. సాయిలు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్, ప్రతినిధులు సాయి రెడ్డి, చక్రధర్, యు. సాయిలు, ఎంసీ పోచయ్య, శాంతయ్య, శివకుమార్, జుగల్ కిషోర్, కిషన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed