- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. స్పందించిన పోలీస్ యంత్రాంగం
దిశ, బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం పోలీస్ స్టేషన్‌లో 9 నెలలుగా ఎస్సై లేకపోవడంతో మండల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజారాం సుమారు రెండు నెలలు విధులు నిర్వహించి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఎస్సై కుర్చీ ఖాళీగా ఉంది. బీర్కూర్‌కు ఎస్సైలు రావడానికి వెనకడుగు వేశారు. ఎస్సైలు రాకపోవడంతో శాంతి భద్రతలు లోపించాయి. ఇష్ట రాజ్యాంగ పేకాట స్థావరాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ మొరం తవ్వకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచాయి. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి.
ఎట్టకేలకు 'దిశ' కథనానికి స్పందించిన పై అధికారులు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఎస్సైని నియమించడం జరిగింది. కామారెడ్డి లో పనిచేస్తున్న సాయి రెడ్డి బీర్కూర్‌కు రానున్నట్లు తెలుస్తుంది. సాయి రెడ్డి ప్రస్తుతం గాంధారి ఎస్సైగా విధులు నిర్వహించి కామారెడ్డి కి వెళ్లారు. సాయి రెడ్డిని బీర్కూర్ ఎస్సైగా నియమించడం జరిగింది. రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. మితిమీరిన రాజకీయ జోక్యం నీ తట్టుకుంటాడో బదిలీపై వెళ్తారో వేచి చూడాలని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.