దోపిడీ దొంగలు అరెస్టు

by Sridhar Babu |
దోపిడీ దొంగలు అరెస్టు
X

దిశ, జక్రాన్ పల్లి : దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ కు కత్తి చూపించి బంగారం, నగదు దోచుకున్న ఘటన మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 3న బుధవారం మధ్యాహ్నం సమయంలో కొలిప్యాక్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పసుల గంగాధర్ ను ట్రీట్మెంట్ నిమిత్తమై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ మీద ఎక్కించుకొని గ్రామ శివారులోని నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తి చూపించి

తన దగ్గర ఉన్న అర తులం బంగారు ఉంగరం, రూ.5 వేలు నగదు, ఒక సెల్ ఫోను దోచుకుని వెళ్లిన కేసులో ఆర్మూర్ లోని వడ్డెర కాలానికి చెందిన చిన్న గంగాధర్ అలియాస్ దేవల నరసయ్య, తొర్లికొండ గ్రామానికి చెందిన కాటుపల్లి సతీష్ అలియాస్ గంగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి దోపిడీ చేసిన బంగారు ఉంగరం, ఒక సెల్ ఫోన్, రూ. 15 వందల నగదును అదే విధంగా వారు ఉపయోగించిన బైక్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed