ఆర్మూర్ హైవేపై రోడ్డు ప్రమాదం...యువతి మృతి

by Sridhar Babu |
ఆర్మూర్ హైవేపై రోడ్డు ప్రమాదం...యువతి మృతి
X

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో 44 నంబర్ హైవేపై ఓ యువతి రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చేపూర్ గ్రామానికి చెందిన చంద్రకళగా గుర్తించారు.

ఈమె ఆటో దిగి రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed