- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో కేసుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : ఎస్పీ కోటిరెడ్డి
దిశ ప్రతినిధి, వికారాబాద్ : మహిళా సంబంధిత, ఎస్సీ, ఎస్టీ, కేసులలో నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పోలీసు సిబ్బందిని హెచ్చరించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో గ్రేవ్ కేసులపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల వారీగా గ్రేవ్ కేసులకు సంబందించిన సమాచారం తెలుసుకొని ఫైల్స్ పరిశీలించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ పోలీస్ అధికారులు జిల్లాలో జరిగే గ్రేవ్ కేసుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడా వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళా సంబంధిత నేరాలు, ఎస్సీ ఎస్టీ, ఫోక్సో నేరలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నారు.
గ్రేవ్ కేసులు నమోదు అయినా వెంటనే ఉన్నత అధికారుల తీసుకెళ్లి సలహాలు సూచనలు తీసుకోవాలి అన్నారు. అధికారులు నేరస్థలం పరిశీలించి, బాధితులకు రక్షణ కల్పించాలని, ఫోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులలో బాధితులకు ఆర్థిక సహాయం కొరకు సంబంధిత పత్రాలను వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా కలెక్టర్ కార్యాలయానికి చేర్చాలని తెలిపినారు. ఈ సమావేశంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్, జిల్లా డీస్పీ అధికారులు, ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.